అల్లు అర్జున్ డ్యాన్స్‌కు బాలీవుడ్ హాటీ ఫిదా!


అల్లు అర్జున్ డ్యాన్స్‌కు బాలీవుడ్ హాటీ ఫిదా!
అల్లు అర్జున్ డ్యాన్స్‌కు బాలీవుడ్ హాటీ ఫిదా!

టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ డ్యాన్సింగ్ సెన్సేష‌న్. అత‌ని సినిమాల్లో డ్యాన్సుల‌కు ప్ర‌త్యేక స్థానం ఇస్తుంటారు. ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లైన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలోని పాట‌లు రిలీజ్ ముందే చార్టు బ‌స్ట‌ర్స్‌ని నిలిచి రికార్డులు సృష్టించాయి.

ముఖ్యంగా ఈ చిత్రంలోని సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన ` సామ‌జ‌వ‌ర గ‌మ‌న‌..` యూట్యూబ్‌లో వంద మిలియ‌న్ వ్యూస్‌ని దాటి టాలీవుడ్‌లో స‌రికొత్త రికార్డుని నెల‌కొల్పింది. ఆ త‌రువాత యువ గేయ ర‌చ‌యిత రాసిన `రాములో రాములా.. గీతం కూడా వంద మిలియ‌న్ వ్యూస్ దాటి చ‌రిత్ర సృష్టించింది. ఇనిమా రిలీజ్ త‌రువాత రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన `బుట్ట బొమ్మ బుట్ట బొమ్మా..` కూడా వైర‌ల్ అయింది.

ఈ పాట‌లోని బ‌న్నీ స్టెప్‌కు బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిషా ప‌టాని ఫిదా ఈయిపోయింద‌ట‌. ఈ పాట‌కు బాలీవుడ్‌కు చెందిన శిల్పాశెట్టి, ఆమె సోద‌రి ష‌మితా శెట్టి డ్యాన్స్ చేసి ఆ వీడియోల‌ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకోవ‌డంతో ఈ పాటు అక్క‌డ కూడా బాగా వైర‌ల్ అయింది. తాజాగా ఈ పాట‌లోని బ‌న్నీ స్టెప్‌కు దిషా ప‌టాని ఫిదా కావ‌డం ఆక‌ట్టుకుంటోంది. పై నుంచి కిందకి జారుతూ అల్లు అర్జున్ వేసే స్టెప్ హైలైట్ ఆ స్టెప్ ఎలా సాధ్య‌మైంద‌ని దిషా అల్లు అర్జున్‌ని ప్ర‌శించింది. దానికి అల్లు అర్జున్ తాను మ్యూజిక్‌ని ప్రేమిస్తాన‌ని, మంచి మ్యూజిక్ త‌న‌తో డ్యాన్స్ చేయిస్తుంద‌ని వెల్ల‌డించాడు. వీరిద్ద‌రి సంభాష‌ణ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.