`ఛ‌త్ర‌ప‌తి` రీమేక్‌లో హీరోయిన్ ఫిక్సా?

disha patani green signal to Chatrapathi remake?
disha patani green signal to Chatrapathi remake?

చంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఛ‌త్ర‌ప‌తి`. ప్ర‌భాస్ కెరీర్‌లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న ఈ చిత్రం ప్ర‌భాస్‌ని స్టార్‌ని చేసింది. ఇదే చిత్రాన్ని ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ రీమేక్ మూవీతో బెల్లంకొండ శ్రీ‌నివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌కు మాస్ లో వున్న ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. నిర్మాత జ‌యంతీలాల్ గ‌డ పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. వి. వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రానికి హీరోయ‌న్ స‌మ‌స్య‌గా మారింది. ఇటీవ‌ల ప‌లువురి పేర్ల‌ని ప‌రిశీలించారు. కియారా న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కానీ ఫైన‌ల్‌గా బాలీవుడ్ సెక్సీ లేడీ, తెలుగులో `లోఫ‌ర్‌` చేసిన దిశా ప‌టాని న‌టించ‌నుంద‌ని తెలిసింది. ఇందు కోసం దిశా భారీగా డిమాండ్ చేసింద‌ని, అంత మొత్తం ఇవ్వ‌డానికి మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలిసింది. బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఈ సంక్రాంతికి `అల్లుడు అదుర్స్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు కానీ ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయిన విష‌యం తెలిసిందే.