`పుష్ప‌` కోసం దిషా ప‌టాని పాట‌?`పుష్ప‌` కోసం దిషా ప‌టాని పాట‌?
`పుష్ప‌` కోసం దిషా ప‌టాని పాట‌?

అల్లు అర్జున్  18 నెల‌ల త‌రువాత `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. మాట‌ల మాంత్రికుడు తెర‌కెక్కించిన ఈ చిత్రం బ‌న్నీకి తొలి ఇండ‌స్ట్రీ హిట్‌ని అందించింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని టార్గెట్ చేశాడు. అదే `పుష్ప‌`. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

శేషాచ‌లం అడువుల నేప‌థ్యంలో గంధపు చెక్క‌ల స్మ‌గ్లింగ్ ప్ర‌ధాన ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బ‌న్నీ తొలిసారి లారీ డ్రైవ‌ర్‌గా ఊర‌మాస్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్‌గా గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా బ‌న్నీ పాత్ర చాలా కొత్త పంథాలో సాగ‌నుంది. ర‌ష్మ‌క మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే ఓ షెడ్యూల్‌ని పూర్తి చేశారు.

కీల‌క షెడ్యూల్ ప్రారంభించాల‌ని ప్లాన్ చేశారు అయితే క‌రోనా భారీ షాక్ ఇవ్వ‌డంతో షూటింగ్‌ని వాయిదా వేశారు. ఇక సుకుమార్ త‌న చిత్రాల్లో స్పెష‌ల్ ఐట‌మ్ సాంగ్ వుండేలా ప్లాన్ చేస్తుంటాడు. ఈ చిత్రం కోసం కూడా ఓ స్పెష‌ల్ సాంగ్‌ని ప్లాన్ చేశాడ‌ట‌. ఈ పాట కోసం ఊర్వ‌శీ రౌతేలాతో పాటు మ‌రి కొంత మందిని పరిశీలించిన సుకుమార్ ఫైన‌ల్‌గా దిషా ప‌టానిని ఎంపిక చేసే ఆలోచ‌నలో వున్న‌ట్టు తెలిసింది. దిష చేస్తే ఈ పాట `పుష్ప‌` చిత్రానికి ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచే అవ‌కాశం వుంది.