మాలో మళ్ళీ లొల్లి … రాజీనామా చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తీవ్ర గందరగోళానికి గురిచేసిన విషయం తెలిసిందే . ఇటీవలే తీవ్ర వాదోపవాదాల నడుమ జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో శివాజీ ప్యానల్ ఓడిపోగా నరేష్ ప్యానల్ విజయం సాధించింది . అయితే విజయం సాధించి నెల రోజులు మాత్రమే అయ్యింది అయినప్పటికీ అప్పుడే లొల్లి మొదలయ్యింది నిధుల విషయంలో . దాంతో మా ఉపాధ్యక్షుడు దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేసాడు .

మా అసోసియేషన్ లో నిధుల విషయంలో అవకతవకలు జరిగాయని అందుకే రాజీనామా చేస్తున్నానని తన సన్నిహితులతో అన్నారట ఎస్వీ కృష్ణారెడ్డి . అయితే ఈ విషయం పై మా అసోసియేషన్ నుండి ఎలాంటి స్పందన రాలేదు . నరేష్ ప్రస్తుతం హైదరాబాద్ లో లేడు వచ్చాక ఈ రాజీనామా విషయం పై స్పందిస్తాడేమో చూడాలి .