డిజప్పాయింట్ చేసిన రేస్ 3


divide talk to salman khans race 3రేస్ సిరీస్ లలో వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఆ సిరీస్ లో వస్తున్న రేస్ 3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈరోజు విడుదలైన రేస్ 3 చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది , సినిమా డిజప్పాయింట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సల్మాన్ అభిమానులు . అనిల్ కపూర్ , సల్మాన్ ఖాన్ , జాక్వెలెన్ ఫెర్నాండేజ్ , డైసీషా , బాబీ డియోల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రెమో డిసౌజా దర్శకత్వం వహించాడు .

సల్మాన్ ఖాన్ హీరో కావడంతో బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని అనుకున్నారు దాంతో పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ వచ్చాయి మార్నింగ్ షోకి కానీ సినిమా పూర్తికాకుండానే రిపోర్ట్ బయటకు పొక్కడంతో మ్యాట్నీ కి పరిస్థితి పూర్తిగా మారిపోయింది దాంతో కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి . అయితే హీరో సల్మాన్ కాబట్టి అందునా రంజాన్ సీజన్ కాబట్టి ఈ రెండు , మూడు రోజులు వసూళ్లు బాగానే ఉంటాయి . కానీ ఓవరాల్ గా మాత్రం ప్లాప్ జాబితాలో చేరేలా ఉంది సినిమా . ఎందుకంటే నెటిజన్లు సోషల్ మీడియాలో రేస్ 3 ని తూర్పార బడుతున్నారు అలాగే ట్రేడ్ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ కూడా రేస్ 3 డిజప్పాయింట్ చేసిందని, రెమో డిసౌజా కు బంగారం లాంటి ఛాన్స్ వస్తే ఉపయోగించుకోలేక పోయాడని వాపోతూ ట్వీట్ చేసాడు .