జులై 6 వస్తొన్న”దివ్యమణి”


divya mani movie release date

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై గిరిధర్ గోపాల్ దర్శకత్వంలొ నిర్మిస్తున్న చిత్రం “దివ్య మణి”. ప్రముఖ యోగా గురు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా ,వైశాలి, కిమయా హీరొయిన్స్ గా నటిస్తున్న “దివ్య మణి” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.

బ్యాంకాక్, పటాయా, నోమెన్స్ ల్యాండ్ మరియు ఎన్నో అందమైన ఫారిన్ లొకేషన్స్ లో చిత్రీకరించబడిన “దివ్యమణి”లో మొట్టమొదటిసారిగా ప్యారలెల్ కిక్ మరియు నాన్ చాక్ తో టేబుల్ టెన్నిస్ ఆడడం, రన్నింగ్ లారీ క్రింద నుండి స్లయిడ్ అవ్వడం వంటి అద్భుతమైన స్టంట్స్ ను రోప్ లేకుండా రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో చిత్రీకరించారు. జాకీచాన్, టోనీజా వంటి యాక్షన్ హీరోలతో ఎన్నో చిత్రాలలో పనిచేసిన జైకాకేషా ఫైట్ మాస్టర్ వినూత్నమైన ఫైటింగులతో చిత్రీకరించడం మరో పెద్ద విశేషం. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథనానికి స్టైలిష్ స్క్రీన్ ప్లే యాడ్ చేసి గిరిధర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

ఈ చిత్రానికి మాటలు: బలభద్రపాత్రుని రమణి, సినిమాటోగ్రఫీ: రాజేష్ కాటా, పైట్స్: జైక (థాయ్ లాండ్), రామ్ లక్ష్మణ్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్, కధ- దర్శకత్వం : గిరిధర్ గోపాల్.