విజయ్ దేవరకొండ మీద ఆగ్రహంగా ఉన్న పవన్ ఫ్యాన్స్


Don’t Compare Vijay Deverkonda with Pawan Kalyan says pawan fansవిజయ్ దేవరకొండ ని పవన్ కళ్యాణ్ తో పోల్చవద్దని అతడికి అంత సీన్ లేదని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . తొలిప్రేమ చిత్రంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పవర్ స్టార్ అయిపోయాడు ఇక ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనిలేకుండా పోయింది అంతగా ప్రభావితం చేసింది తొలిప్రేమ చిత్రం . పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయి ఇమేజ్ ఎవరికీ రాలేదని అది మళ్ళీ ఒక్క విజయ్ దేవరకొండ కు మాత్రమే వచ్చిందని అగ్ర నిర్మాత దిల్ రాజు నిన్న జరిగిన గీత గోవిందం సక్సెస్ మీట్ లో అన్నాడు . దిల్ రాజు విజయ్ దేవరకొండ ని పవన్ కళ్యాణ్ తో పోల్చి పది గంటలు కాలేదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

పవన్ కళ్యాణ్ తో విజయ్ దేవరకొండ ని పోల్చొద్దు , విజయ్ దేవరకొండ మంచి హీరో అంతే ! ఎప్పటికి పవన్ కళ్యాణ్ ని చేరుకోలేడు

పవన్ కళ్యాణ్ ఎవరెస్టు శిఖరం లాంటోడు , విజయ్ దేవరకొండ కు అంతలేదు

పవన్ కళ్యాణ్ ని రీప్లేస్ చేసే హీరో ఇంతవరకు రాలేదు , రాడు కూడా

అసలు సిసలైన స్టార్ ఒక్కడే అతడే పవర్ స్టార్ ర్ ర్ ర్ ……. దయచేసి పవన్ కళ్యాణ్ తో పోల్చొద్దు అని రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు పవన్ ఫ్యాన్స్ . అయితే వాళ్లకు కూడా విజయ్ దేవరకొండ మీద కోపం లేదు కానీ పవన్ కళ్యాణ్ తో పోల్చేసరికి కోపం వస్తోంది .

English Title: don’t compare vijay deverkonda with pawan kalyan says pawan fans