ప్రజలకు విజ్ఞప్తి – “దీపం పెట్టండి చాలు…! ఇంకా అతి చెయ్యద్దు”


ప్రజలకు విజ్ఞప్తి – “దీపం పెట్టండి చాలు…! ఇంకా అతి చెయ్యద్దు”
ప్రజలకు విజ్ఞప్తి – “దీపం పెట్టండి చాలు…! ఇంకా అతి చెయ్యద్దు”

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారతదేశ ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ వరకు 21 రోజులపాటు లాక్ డౌన్ పాటించమని ప్రజలను ఆదేశించింది. ఈ లాక్ డౌన్ ప్రారంభ సమయంలో అనగా తొమ్మిది రోజుల ముందు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్లీ ఈరోజు ఉదయం 9 గంటలకు భారత జాతిని ఉద్దేశించి సందేశాన్ని విడుదల చేశారు.

కరోనా వైరస్ యొక్క వ్యక్తిగతంగా మనుషులనే కాకుండా మన ఆచారాలు మన సాంప్రదాయాలను కూడా  ప్రశ్నిస్తోంది.! అనీ అన్ని రకాల నమ్మకాలు,విచారాలు భావజాలాలు ఉన్న వ్యక్తులు తమ వర్గంలోని వారికి సరి అయిన జ్ఞానాన్ని ఉపదేశించాలనీ; సామూహిక సమావేశాలు మరియు ప్రార్థనలను చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఆదివారం అనగా ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు భారత దేశ ప్రజలందరూ తమ తమ ఇంటి వద్ద తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలు నిలిపివేసి నూనెతో ప్రమిదలతో చేసిన దీపాలు, కొవ్వొత్తులు లేదా సెల్ ఫోన్ టార్చ్ లైట్ ద్వారా కాంతిని ప్రసరింపజేస్తూ.. కరోనా వైరస్ పై  పోరాటంలో భాగంగా మనమందరం ఒకరికి ఒకరు తోడుగా ఉన్నామని ప్రకటించుకోవాలని సూచించారు.

ఇక మా ప్రధాన విజ్ఞప్తి ఏమిటంటే

  • దయచేసి ఎవరు మన ఇళ్ళల్లో నూనె, ప్రమిదలు కొవ్వొత్తులు లేవని ఒకేసారి బయటకు రావద్దు.
  • ఏ విధంగా అత్యుత్సాహంతో జనతా కర్ఫ్యూ రోజు కొంత మంది రోడ్ల మీదకు వచ్చి సామూహికంగా చప్పట్లు కొట్టినట్లు సామూహికంగా రోడ్ల మీదకు వచ్చి దీపాలు, కొవ్వత్తులు వెలిగించడం, ర్యాలీ చేయడం లాంటివి చేయవద్దు
  • కొంత మంది యువత అత్యుత్సాహంతో బాణాసంచా లాంటివి కాల్చడం చేయవద్దు.

ప్రస్తుత సమయంలో అన్ని రకాల  పనులు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే అందరం నష్టపోతున్నాం.. కాబట్టి ఒకరిపై ఒకరు విద్వేషాలు వ్యాప్తి చేసుకోకుండా దేవుడిని ప్రార్థించడం మంచిది. కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం “ప్రధాని కేవలం దీపాలు మాత్రమే పెట్టమన్నారు..! అది కూడా ఎవరి ఇంట్లో వారినే చేసుకోమని చెప్పారు. ముఖ్యంగా కొంత మంది స్వయం ప్రకటిత మేధావుల తప్పుడు పుకార్లను నమ్మి..”చెప్పిన దానికంటే అతి చెయ్యవద్దు” అని వినమ్రంగా మనవి చేసుకుంటున్నాం.