దొరసాని రివ్యూDorasani Movie Review in Telugu
Dorasani Movie Review in Telugu

నటీనటులు: ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక, కిషోర్‌ కుమార్‌, వినయ్‌ వర్మ, బైరెడ్డి వంశీ కృష్ణారెడ్డి, శరణ్య ప్రదీప్‌ తదితరులు
సంగీతం: ప్రశాంత్‌ విహారి
నిర్మాతలు: యశ్‌ రంగినేని, మధుర శ్రీధర్‌
దర్శకత్వం: కేవీఆర్‌ మహేంద్ర
రేటింగ్: 3/5
రిలీజ్ డేట్: 12-07-2019

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ, జీవితారాజశేఖర్‌ల కుమార్తె శివాత్మిక లను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రందొరసాని’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఆనంద్‌ దేవరకొండశివాత్మిక ఎలా అలరించారు? అనేది తెలియాలంటే దొరసాని కథలోకి వెళ్లాల్సిందే..!!

కథ: 30 ఏళ్ల కిందట జరిగిన కథ ఇది. యథార్థ సంఘటనలు తీసుకున్నానని దర్శకుడు ముందే చెప్పారు. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో సాగే కథ ఇది. పట్టణంలో చదువుకుని వచ్చిన రాజు (ఆనంద్‌ దేవరకొండ) దొరసాని దేవకి(శివాత్మిక)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. రాజు కవిత్వానికి దేవకి కూడా ప్రేమలో పడిపోతుంది. కానీ, ప్రతి ప్రేమకథలాగానే ఈ ప్రేమకూ ఆస్తులు, అంతస్తులు, కులం, పరువు అడ్డుగోడలుగా నిలుస్తాయి.  వాటిని ఈ ప్రేమ జంట ఎలా ఛేదించింది? చివరికి రాజు, దేవకిల కథ ఎలా ముగిసింది? అనేదేదొరసానిచిత్రం.

హైలైట్స్: తెలంగాణ నేపథ్యం, నటీనటుల సహజ నటన,పతాక సన్నివేశాలు

డ్రా బ్యాక్స్: రొటీన్ కథ స్లో నేరేషన్ 

నటీ నటుల ప్రతిభ:  విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండకు ఇదే తొలి చిత్రం. చాలా బరువైన పాత్రను సమర్థంగా పోషించారు. తొలి చిత్రమే అయినా, ఎక్కడా తడబాటు లేదు. తన గొంతు కూడా విజయ్‌ దేవరకొండ గొంతును పోలి ఉండటం వల్ల తెరపై అతన్ని చూసినట్లు అనిపిస్తుంది. దేవకి పాత్రకు శివాత్మిక వందశాతం న్యాయం చేశారు. లుక్స్‌ పరంగా ఆకట్టుకున్నారు. ఆమెకు మాట్లాడే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో ఇచ్చారు దర్శకుడు. కీలకమైన పాత్రలో కిషోర్‌ రాణించారు. దాదాపు 60మంది కొత్త వాళ్లను పరిచయం చేసిన చిత్రమిది. ప్రతి పాత్ర అత్యంత సహజసిద్ధంగా తీసుకురాగలిగారు.

సాంకేతిక వర్గం:  సాంకేతికంగా చూస్తే కథలో పెద్దగా వైవిధ్యం లేదు. కాకపోతే ఎంచుకున్న నేపథ్యం కొత్తగా ఉంది. సంభాషణల్లో కవితాత్మక భావనలు ఆకట్టుకుంటాయి. 1980నాటి వాతావరణాన్ని తెరపై బాగా తీసుకురాగలిగారు. నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. దర్శకుడిలో ప్రతిభ ఉంది. కాస్త వైవిధ్యమున్న కథలు ఎంచుకుంటే, ఆ ప్రతిభ మరింతగా వెలుగులోకి వస్తుంది

ఓవరాల్ గా: దొరసాని ధనికపేదవర్గాల ప్రేమకథ. ప్రేమికులకు తప్పకుండా నచ్చే చిత్రం