దొరసాని ప్రీ లుక్ ఇదిగో


దొరసాని ప్రీ లుక్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు ఆ చిత్ర బృందం . సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ – జీవిత ల చిన్న కూతురు శివాత్మిక దొరసాని గా నటించగా దొరసాని ప్రేమికుడిగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించాడు . ఈ ఇద్దరికీ కూడా ఇది మొదటి సినిమా కావడం విశేషం . కేవీఆర్ మహేంద్ర అనే యువ దర్శకుడి దర్శకత్వంలో ఈ దొరసాని చిత్రం రూపొందింది .

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మే 30 న దొరసాని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మధుర శ్రీధర్ – యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దగ్గుబాటి సురేష్ బాబు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు . ప్రేమ కథా చిత్రం కావడం , అందునా తెలంగాణ దొరల నేపథ్యం కావడంతో ఈ దొరసాని తప్పకుండా సంచలన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది .