క‌లెక్ష‌న్‌కింగ్ స్క్రీన్‌ప్లేతో `స‌‌న్ అఫ్ ఇండియా` రోలిం‌గ్!


క‌లెక్ష‌న్‌కింగ్ స్క్రీన్‌ప్లేతో `స‌‌న్ అఫ్ ఇండియా` రోలిం‌గ్!
క‌లెక్ష‌న్‌కింగ్ స్క్రీన్‌ప్లేతో `స‌‌న్ అఫ్ ఇండియా` రోలిం‌గ్!

క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు కొంత విరామం త‌రువాత న‌టిస్తున్న చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా`. దేశ భ‌క్తి ప్ర‌ధానంగా రూపొందుతున్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్నారు. `గాయ‌త్రి` మూవీ త‌రువాత మోహ‌న్‌బాబు సోలో హీరోగా న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. టైటిల్ పోస్ట‌ర్ నుంచే ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీ ఈ రోజు మోహ‌న్‌బాబు నివాసంలో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ముహూర్త‌పు స‌న్నివేశానికి విరానికి మంచు, ఐరా, అవ్ర‌మ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ల‌క్ష్మీ మంచు, విద్యా నిర్వాణ క్లాప్ నిచ్చారు. మంచు విష్ణు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రెగ్యుల‌ర్ షూటింగ్ శుక్ర‌వారం నుంచే మొద‌లుపెట్టేశారు. ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించిన విశేషం ఏంటంటే మోహ‌న్‌బాబు ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించ‌డం. అంతే కాకుండా ఆయ‌న కోడ‌లు, మంచు విష్ణు వైఫ్ విరోనిక ఈ మూవీకి స్టైలిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు. శుక్ర‌వారం స్వాతంత్య్ర‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ శుక్రవారం మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించారు. ఈ చిత్రానికి స‌ర్వేష్ మురారీ ఛాయాగ్ర‌హ‌ణం, మాస్ట్రోఇళ‌యరాజా సంగీతం, సుద్దాల అశోక్‌తేజ పాట‌లు, గౌత‌మ్ రాజు ఎడిటింగ్ స‌మ‌కూరుస్తున్నారు.