మ‌రో సినిమాకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన రాజ‌శేఖ‌ర్‌!Dr, Rajasekhar and director Neelakanta team up
Dr, Rajasekhar and director Neelakanta team up

సీనియ‌ర్ హీరోగా డా. రాజ‌శేఖ‌ర్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ యాక్ష‌న్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు. ఆయ‌న న‌టించిన `అంకుశం`, మ‌గాడు వంటి చిత్రాలు ఇప్ప‌టికే ఎవ‌ర్‌గ్రీన్ మ‌వీస్‌గా నిలిచిపోయాయి. పోలీస్ స్టోరీస్ అంటే రాజ‌శేఖ‌ర్ అనేంత‌గా పేరు తెచ్చుకున్నారాయ‌న. అయితే గ‌త కొంత కాలంగా స‌రైన స‌క్సెస్ లేని ఆయ‌న మ‌ళ్లీ పోలీస్ క్యారెక్ట‌ర్‌తో స‌క్సెస్ బాట ప‌ట్టారు. ఆయ‌న న‌టించిన `పీఎస్‌వీ గ‌రుడ‌వేగ‌` రాజ‌శేఖ‌ర్ కెరీర్‌కు మ‌ళ్లీ నూత‌న జ‌వ‌స‌త్వాల‌ని అందించింది.

ఈ సినిమా త‌రువాత కూడా ఆయ‌న పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `క‌ల్కీ` కూడా ఫ‌ర‌వాలేద‌నిపించింది. బ‌క్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టలేక‌పోయినా హీ ఈజ్ బ్యాక్ అనిపించింది. ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తి కావ‌స్తున్నా రాజ‌శేఖ‌ర్ మ‌రో చిత్రాన్ని ఇంత వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. తాజాగా ఆయ‌న మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

`షో` చిత్రంతో జాతీయ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిన నీల‌కంఠ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు తెలిసింది. ఓ ప‌వ‌ర్‌ఫుల్ పాయింట్‌తో ద‌ర్శ‌కుడు నీల‌కంఠ ఇటీవ‌లే హీరో డా. రాజ‌శేఖ‌ర్‌కు క‌థ వినిపించార‌ని. స్టోరీ ఎక్స్‌లెంట్‌గా వుండ‌టంతో ఓకే చెప్పిన రాజ‌శేఖ‌ర్ ఈ చిత్రాన్ని స్వ‌యంగా తానే నిర్మిస్తాన‌ని ముందుకొచ్చార‌ట‌. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది. నీల‌కంఠ ఇటీవ‌ల త‌మ‌న్నాతో మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి` చిత్రం నుంచి మ‌ధ్య‌లో త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే.