కల్కి తో హిట్ కొట్టేలాగే ఉన్నాడు


kalki
kalki

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కల్కి చిత్రంతో సూపర్ హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు . గరుడ వేగ చిత్రంతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన హీరో రాజశేఖర్ . కొంత గ్యాప్ తీసుకొని తాజాగా చేసిన చిత్రం కల్కి . ఈనెల 28 న భారీ ఎత్తున విడుదల అవుతోంది ఈ చిత్రం . ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి . కళ్యాణ్ నిర్మించాడు .

నిన్న హానెస్ట్ ట్రైలర్ అని విడుదల చేయగా దానికి  మంచి స్పందన వస్తోంది . ఈ ట్రైలర్ తో తప్పకుండా కల్కి తో రాజశేఖర్ మరో హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు రాజశేఖర్ అభిమానులు . ఇక రాజశేఖర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ సినిమా మీద . 1983 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని కేకే రాధామోహన్ సొంతం చేసుకోవడం విశేషం .