కల్కి కి వచ్చిన సమస్య ఏంటి ?


సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్రం సకాలంలో విడుదల అయ్యేట్లు కనిపించడం లేదు. అసలు ఈ చిత్రం మే నెలలోనే విడుదల కావాల్సి వుండే కానీ సినిమా మొత్తం అయ్యాక , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యాక రష్ చూసుకుని షాక్ అయ్యారట చిత్ర బృందం. సినిమాకు హైప్ వచ్చింది కానీ ఆ హైప్ కి తగ్గట్లుగా సినిమా లేకపోవడంతో మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారట.

సినిమా అనుకున్న స్థాయిలో రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారట . దాంతో అన్ని పనులు పూర్తయ్యాక మరోసారి ఫస్ట్ కాపీ చూసుకున్నాక మాత్రమే సినిమా విడుదల అనౌన్స్ చేయాలని భావిస్తున్నారట. 1980 నాటి క్రైమ్ కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజశేఖర్ సరసన ఆదా శర్మ , నందిత శ్వేతా నటిస్తుండగా పూజిత పొన్నాడా తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గరుడవేగ వంటి సూపర్ హిట్ తర్వాత రాజశేఖర్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక టీజర్ , ట్రైలర్ ల వల్ల కూడా కల్కి చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఈ కల్కి విడుదల కావాలంటే మరో 2 నెలలు పట్టొచ్చు అని తెలుస్తోంది.