వైరల్ అవుతున్న రాజశేఖర్ స్టిల్


Dr. Rajasekhar's Kalki motion poster out

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్ర మోషన్ పోస్టర్ ని ఈరోజు విడుదల చేసారు . కాగా మోషన్ పోస్టర్ విడుదల అవడమే ఆలస్యం వైరల్ గా మారింది . డాక్టర్ రాజశేఖర్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది . 1983 నాటి కాలం కథతో తెరకెక్కుతోంది కల్కి చిత్రం . డాక్టర్ రాజశేఖర్ ఇన్ వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆదా శర్మ , నందితా శ్వేతా హీరోయిన్ లుగా నటిస్తున్నారు .

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది . మళ్ళీ రాజశేఖర్ కు సూపర్ హిట్ నిచ్చి పాత రోజులను తీసుకురావడం ఖాయమని ధీమాగా ఉన్నారు . రాజశేఖర్ కూతుర్లు శివాని – శివాత్మిక లు ఇద్దరూ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించడం విశేషం . నిన్ననే టీజర్ ని విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది దాంతో ఈ మోషన్ పోస్టర్ కు క్రేజ్ ఏర్పడింది . మొత్తానికి మోషన్ పోస్టర్ చూస్తుంటే కల్కి తప్పకుండా హిట్ అయ్యేలాగే కనిపిస్తోంది .

English Title: Dr. Rajasekhar’s Kalki motion poster out