కల్కి చిత్రానికి లాభాలు


కల్కి పోస్టర్
కల్కి పోస్టర్

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” కల్కి ” . మే 24 న విడుదల కానున్న ఈ చిత్రానికి బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . పలు చిత్రాలను నిర్మించిన కేకే రాధామోహన్ కల్కి చిత్రాన్ని 12 కోట్లకు కొన్నాడట ! ఇక శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో 10 కోట్లకు పైగా వచ్చేలా ఉంది దాంతో రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్ చిత్రంగా నిలిచింది కల్కి .

రాజశేఖర్ సరసన ఆదా శర్మ , నందితా శ్వేత నటించగా 1980 నాటి కాలం కథతో కల్కి చిత్రం తెరకెక్కింది . కల్కి టీజర్ , ఫస్ట్ లుక్ లతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి దాంతో బిజినెస్ పరంగా మంచి వ్యాపారం జరుగుతోంది . తక్కువ బడ్జెట్ లో రూపొందిన కల్కి చిత్రానికి అప్పుడే 10 కోట్ల కు పైగా లాభాలు వస్తున్నాయి . మే 24 న విడుదల కానున్న కల్కి రిలీజ్ కి ముందే ఇంత సంచలనం సృష్టిస్తే రేపు రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి .