`దృశ్యం` తెలుగు రీమేక్‌కి లైన్ క్లియ‌ర్‌!

`దృశ్యం` తెలుగు రీమేక్‌కి లైన్ క్లియ‌ర్‌!
`దృశ్యం` తెలుగు రీమేక్‌కి లైన్ క్లియ‌ర్‌!

మ‌ల‌యాళంలో రూపొందిన చిత్రం `దృశ్యం`. మోహ‌న్‌లాల్‌, మీనా జంట‌గా న‌టించిన ఈ చిత్రం అక్క‌డ‌ సంచ‌ల‌న విజ‌యాన్నిసాధించింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్, మీనాల‌తో రీమేక్ చేశారు. ఇక్క‌డ కూడా ఈ మూవీ అదే త‌ర‌హా ఆద‌ర‌ణ‌ని సొంతం చేసుకుని ప్ర‌శంస‌లు పొందింది.

తాజాగా ఇదే చిత్రానికి సీక్వెల్‌గా `దృశ్యం 2`ని రూపొందించారు. మోహ‌న్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ రూపొందించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్ మ‌రోసారి న‌టించ‌బోతున్నారు. కాగా ఈ చిత్రానికి మాతృక డైరెక్ట‌ర్ జీతు జోసెఫే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ట‌.

ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు హైద‌రాబాద్‌లో ప్రారంభించార‌ని, ఈ మూవీ షూటింగ్ కోసం లొకేష‌న్స్‌ని వెతుకు తున్నార‌ట‌. మ‌రో సంస్థ‌తో క‌లిసి ఈ రీమేక్‌ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. సురేష్‌బాబు నిర్మించ‌నున్నార‌ట‌. మార్చి నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని, జెట్ స్పీడుతో ఈ మూవీని పూర్తి చేసి వీలైనంత త‌ర్వ‌లోనే థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.