మహానటి చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు సమంత , విజయ్ దేవరకొండ లు మాత్రమే కాదు జెమిని గణేశన్ పాత్రలో డుల్కర్ సల్మాన్ నటించాడు . అతడు మలయాళంలో రైజింగ్ లో ఉన్న హీరో పైగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు కూడా దాంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . కీర్తి సురేష్ , సమంత , విజయ్ దేవరకొండ లను పొగిడి మా హీరో దుల్కర్ ని ఎలా మర్చిపోతారు అంటే ….. మా హీరోని అవమానించడమే అంటూ రకుల్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు . రకుల్ పొరపాటున డుల్కర్ ని మర్చిపోయి ఉంటుంది దాంతో అతడి అభిమానుల నుండి తిట్లు తింటోంది పాపం .