ఆదితిని ఏడిపించిన దుల్క‌ర్ స‌ల్మాన్‌!


ఆదితిని ఏడిపించిన దుల్క‌ర్ స‌ల్మాన్‌!
ఆదితిని ఏడిపించిన దుల్క‌ర్ స‌ల్మాన్‌!

మలయాళ హార్ట్‌త్రోబ్ దుల్కర్ సల్మాన్ తన బెస్ట్ ఫ్రెండ్‌ అదితి రావు హైడారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అదితీరావు ఈ బుధ‌వారం పుట్టిన రోజు జ‌రుపుకుంది. డ్యాన్స్ మాస్టర్ బృంద ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతూ త‌మిళంలో `హే సినామిక‌` చిత్రాన్ని రూపొందిస్తోంది. దుల్క‌ర్ స‌ల్మాన్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటు ఈ చిత్రంలో అదితిరావు హైద‌రీ కూడా న‌టిస్తోంది. ఈ సెట్‌లో పుట్టిన రోజు సందర్భంగా దుల్క‌ర్ స‌ల్మాన్.. అదితిని ఆట ప‌ట్టించాడు.

ఈ సందర్భంగా అదితి ఏడుస్తున్న ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.   అంతా అదితి న‌వ్వుతున్న ఫొటోల‌ని షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తే దుల్క‌ర్ మాత్రం అదితి ఏడుస్తున్న ఫొటోలని షేర్ చేసి `క్రై బేబీ` అని కామెంట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

అదితిరావు హైద‌రీ, దుల్క‌ర్ స‌ల్మాన్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జ‌రుగుతోంది. కీల‌క పాత్ర‌లో కాజ‌ల్ క‌నిపించ‌బోతోంది. బృందా గోపాల్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్న చిత్ర‌మిది. అదితిరావు హైద‌రీ తెలుగులో ప్ర‌స్తుతం `మ‌హా స‌ముద్రం` చిత్రంలో న‌టిస్తోంది. శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ హీరోలుగా న‌టిస్తున్నారు. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌కుడు.