పవన్ కళ్యాణ్ గుర్తు ఏంటో తెలుసా


EC assigns Glass Tumbler symbol to Pawan Kalyan 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది . ఇంతకీ పవన్ కళ్యాణ్ కు కేటాయించిన గుర్తు ఏంటో తెలుసా …… గాజు గ్లాస్ గుర్తు . జనసేన తరుపున పోటీ చేసే అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయిస్తారు అన్నమాట ! జనసేన పార్టీని 2014 లో స్థాపించిన విషయం తెలిసిందే . అయితే 2014 లో పోటీ చేయకుండా తెలుగుదేశం – బిజెపి కూటమి కి మద్దతు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ .

కానీ 2019 లో జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నాడు పవన్ కళ్యాణ్ . తమ్ముడికి అండగా తెరవెనుక చిరంజీవి , నాగబాబు లు పెద్ద ప్రయత్నాలే చేస్తున్నారట . ఎన్నికల నాటికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుండి అలాగే తెలుగుదేశం పార్టీ నుండి నాయకులు తరలి రానున్నారని దాంతో జనసేన తరుపున ఎక్కువమంది శాసనసభ్యులు గెలవడం ఖాయమని , ఒకవేళ ప్రజలు పెద్ద ఎత్తున మార్పు కోరుకుంటే జనసేన అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నాగబాబు అండ్ కో . గతంలో కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 294 నియోజకవర్గాలలో 292 గెలుస్తామని గొప్పలు పోయారు కట్ చేస్తే గెలిచింది 17 మాత్రమే !

English Title: EC assigns Glass Tumbler symbol to Pawan Kalyan