ఈ నగరానికి ఏమైంది రివ్యూ


ee nagaraniki emaindi review
ఈ నగరానికి ఏమైంది రివ్యూ:
నటీనటులు : విశ్వక్ సేన్ నాయుడు , ప్రశాంత్ రెడ్డి , అనిషా అంబ్రోస్ , అభినవ్
సంగీతం : వివేక్ సాగర్
నిర్మాత : దగ్గుబాటి సురేష్ బాబు
దర్శకత్వం : తరుణ్ భాస్కర్ దాస్యం
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 29 జూన్ 2018

పెళ్లి చూపులు చిత్రంతో సంచలన విజయం సాధించిన దాస్యం తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని కాస్త ఆలస్యంగానైనా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేసాడు ” ఈ నగరానికి ఏమైంది ” అన్న టైటిల్ తో . ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

వివేక్ ( విశ్వక్ సేన్ నాయుడు ) కార్తీక్ ( సుశాంత్ రెడ్డి ) కౌశిక్ ( అభినవ్ గోమఠం )ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను ) ఈ నలుగురు ప్రాణ స్నేహితులు అయితే వివేక్ మాత్రం డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగి పోవాలని కళలు కంటాడు ,కెరీర్ అంతగా సాగకపోవడంతో అతడి లవ్ బ్రేకప్ అవుతుంది దాంతో అటు డైరెక్టర్ కాలేక ఇటు లవ్ లో ఫెయిల్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్తాడు . నలుగురు స్నేహితులతో ఒకడైన కార్తీక్ కు పెళ్లి కుదరడంతో అందరూ కలిసి మందు పార్టీ చేసుకుంటారు ఫుల్లుగా తాగుతారు అయితే ఆ మత్తులో ఏకంగా గోవా వెళ్ళిపోతారు . గోవా వరకు వాళ్ళ జర్నీ ఎలా సాగింది ? జీవిత సత్యాన్ని వాళ్ళు ఎలా తెలుసుకున్నారు ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ఆర్టిస్టుల నటన
సెకండాఫ్
డైరెక్షన్

డ్రా బ్యాక్స్ ;

ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు
లవ్ ట్రాక్

నటీనటుల ప్రతిభ :

నలుగురు కుర్రాళ్ళు విశ్వక్ సేన్ నాయుడు , సుశాంత్ రెడ్డి , వెంకటేష్ కాకుమాను , అభినవ్ గోమఠం కొత్త కుర్రాళ్ళు అయినప్పటికీ వాళ్ళ వాళ్ళ పాత్రల్లో బాగా రాణించారు . విశ్వక్ సేన్ నాయుడు చాలా బాగా నటించాడు , ఇక అభినవ్ గోమఠం కామెడీ కుర్రాళ్లకు బాగా రిలీఫ్ నిచ్చింది . మిగిలిన పాత్రధారులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

ముందుగా దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే ……. పెళ్లి చూపులు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా మళ్ళీ కొత్తవాళ్ల తో ప్రయోగం చేయడం అభినందనీయం . దాదాపుగా తన కథనే రాసుకున్నాడు తరుణ్ , దర్శకుడు కాకముందు తరుణ్ పడిన బాధని ప్రధాన పాత్ర చేసి చూపించిన విధానం బాగుంది . ఫ్రెండ్స్ చుట్టూ అల్లిన కథ తో కుర్రాళ్ళని టార్గెట్ చేసాడు తరుణ్ భాస్కర్ . ఫస్టాఫ్ లో కొంత లాగ్ ఉన్నప్పటికీ యువత ని ఆకట్టుకునేలా ఓ మెసేజ్ ని అందించి మెప్పించాడు . వివేక్ సాగర్ సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అలాగే నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం కూడా హైలెట్ గా నిలిచింది .

ఓవరాల్ గా :

యూత్ ని ఆకట్టుకునే సందేశాత్మక చిత్రం అనడంలో సందేహం లేదు

English Title: EE Nagaraniki Emaindi Review

                         Click here for English Review