ఈషా రెబ్బా ని కూడా లైంగికంగా వేధించారట !

తెలుగమ్మాయి ఈషా రెబ్బా ని కూడా లైంగికంగా కొంతమంది వేధించారట ! అయితే అలాంటి వాళ్లకు దూరంగా జరిగితే చాలు ప్రతీ ఒకరితో గొడవ పెట్టుకోలేం కదా ! అని అంటోంది ఈషా . అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ఈషా రెబ్బా . ఆ సినిమా హిట్ అయినప్పటికీ పాపం ! ఈ భామకు ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు రాలేదు దాంతో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటోంది .

అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉందని , నన్ను కూడా కొంతమంది లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారని అయితే అలాంటి వాళ్లకు కాస్త దూరంగా ఉంటే సరిపోతుందని , సింపుల్ గా నో అని చెప్తే సరి నేను అలాగే చేసానని అంటోంది ఈషా రెబ్బా . శ్రీ రెడ్డి చెప్పినట్లు ఇక్కడ చాలామందే ఉన్నారు అయితే అందుకు అంగీకరించకుండా ఉంటే సరిపోతుంది కదా ! అని సలహా ఇస్తోంది .