లస్ట్ స్టోరీస్.. కథ మార్చేసారట!


లస్ట్ స్టోరీస్.. కథ మార్చేసారట!
లస్ట్ స్టోరీస్.. కథ మార్చేసారట!

వెబ్ సిరీస్ లు ప్రస్తుతం మారుతున్న డిజిటల్ యుగంలో ఒక విప్లవం. సినిమాకు ఎంత మాత్రం తీసిపోని టెక్నాలజీతో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ లు సరిగ్గా ప్లాన్ చేసి తీస్తే నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి. ఇప్పటికే హిందీలో చాలానే వెబ్ సిరీస్ లు మన ముందుకు వచ్చాయి. లస్ట్ స్టోరీస్, మీర్జాపూర్, సాక్రెడ్ గేమ్స్, ఫ్యామిలీ మ్యాన్.. ఇలా ఎన్నో హిందీ వెబ్ సిరీస్ లు దేశవ్యాప్తంగా సక్సెస్ అవుతున్నాయి. ఇవి సబ్ టైటిల్స్ తో పాటు వస్తాయి కాబట్టి అన్ని భాషల వాళ్ళూ భేషుగ్గా చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. ఈ మధ్య ఈ వెబ్ సిరీస్ ల ట్రెండ్ తెలుగులో కూడా ఊపందుకుంది. ఇప్పటికే తెలుగులో పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు ఉన్నా కొంచెం ఎఫెక్టివ్ గా, సీరియస్ గా సాగే వెబ్ సిరీస్ గా గాడ్స్ ఆఫ్ ధర్మపురి నిలిచింది. ఒక పది ఎపిసోడ్లు ప్లాన్ చేసుకోవడం.. ప్రతి ఎపిసోడ్ లో చివర్లో మంచి టైమింగ్ దగ్గర ఎండ్ చేయడం.. ఇలాంటి వ్యవహారాలతో వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది. చిన్న నటులే కాక పేరున్న వారు కూడా ఈ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తుండడం విశేషం. జగపతి బాబు లాంటి వారు ఇప్పటికే వెబ్ సిరీస్ లో నటించేసారు. ఈ మధ్య సందీప్ కిషన్ కూడా ఫ్యామిలీ మ్యాన్ లో ఒక పాత్ర వేసాడు. ఇప్పుడు సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హిందీలో సూపర్ హిట్ అయిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ను తెలుగులో తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

నాలుగు భాగాలుగా తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ ను ఒక్క పార్ట్ ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తాడు. అలాగే తెలుగులో దీనికోసం సంకల్ప్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగ, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్ లు ఎంపికయ్యారని, షూట్ కూడా మొదలైందని తెలుస్తోంది. లస్ట్ స్టోరీస్ అనగానే అందులో కియారా ఎపిసోడ్, అందునా వైబ్రేటర్ సీన్ ప్రేక్షకులకు గుర్తొస్తాయి. సెన్సార్ లేని కారణంగా ఎలాగైనా ఈ వెబ్ సిరీస్ ను తీసుకొనే స్వేచ్ఛ ఉండడం కూడా కలిసొస్తోంది ఇలాంటి సీన్లు తీయడానికి. ప్రస్తుతం కియారా పాత్రకు తెలుగులో ఈషా రెబ్బ ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఖండించింది ఈషా.

ఒకసారి వెబ్ సిరీస్ రూపొందించాక మళ్ళీ అదే ఎలా తీస్తారని ఆమె ప్రశ్నించింది. కథ మొత్తం వేరని క్లారిటీ ఇచ్చింది. ఆమె సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తోందిట. ఇప్పటికే సంకల్ప్ రెండు ఎపిసోడ్స్ షూట్ చేసి ఇచ్చాడని ఈషా తెలిపింది. ఈ ఎపిసోడ్స్ లో ఈషాతో పాటు సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ కూడా నటించినట్లు ఆమె తెలిపింది. అయితే మిగతా ఎపిసోడ్స్ ను ఎవరు రూపొందిస్తున్నారో తనకు తెలియదని, ఈ విషయంలో తాను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని ఈషా తెలిపింది. ఆమె నటించిన రాగల 24 గంటల్లో మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది.