అచ్చం తెలుగందం.. కనులకు మాయ చేసెనే


Eesha Rebba
అచ్చం తెలుగందం.. కనులకు మాయ చేసెనే

అన్ని సినిమా ఇండస్ట్రీలలో దాదాపుగా వారి రాష్ట్రం నుండి వచ్చిన హీరోయిన్లు చక్రం తిప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బయట కథానాయికల హవా నడుస్తుంటుంది. హీరోయిన్లు కావాలనుకునే తెలుగు అమ్మాయిలను అడిగితే.. తెలుగు వారనే చులకనతో అవకాశాలు ఇవ్వట్లేదని అంటారు. అదే దర్శకులను, నిర్మాతలను అడిగితే తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావడానికి ఇంకా భయపడుతున్నారు అంటారు. ఏదేమైనా తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్లు లేరనేది అక్షర సత్యం.

దీని గురించి ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు. కానీ నిజంగా ఏదో సాధిద్దామని వచ్చిన అమ్మాయిలకు తగిన అవకాశాలు లభిస్తున్నాయా అంటే లేదనే సమాధానం లభిస్తుంది. అందుకు సరైన ఉదాహరణ ఈషా రెబ్బ. అందానికి అందం, పదహారణాల తెలుగుదనం, గ్లామర్ ఒలికించగల తత్త్వం, అన్నిటికీ మించి అభినయించగల నైపుణ్యం ఈషా సొంతం. పై ఫోటోనే తీసుకుంటే ట్రెడిషనల్ వేర్ లో గ్లామర్ ఒలికించడం ఎలాగో ఈషాను చూసే నేర్చుకోవాలి.

ప్రస్తుతం ఈషా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రాగల 24 గంటల్లో సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా ఒక తమిళ సినిమా, ఒక కన్నడ సినిమా ఒప్పుకుంది. మరి ఈషా త్వరలోనే మంచి సినిమాలు చేజిక్కుంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుందాం.

Credit: Instagram