ఫొటోస్టోరీ: ఆ చూపులు చుర‌క‌త్తులు

Eesha rebba heatup internet once again
Eesha rebba heatup internet once again

అవ‌కాశాల కోసం క‌థానాయిక‌లు ఎంత ర‌చ్చ చేయాలో అంత ర‌చ్చ చేస్తున్నారు. ఇందుకు వారికి దొరికిన ఏకైక సాధ‌నం సోష‌ల్ మీడియా. టాలీవుడ్ టు బాలీవుడ్‌.. క్రేజీ హీరోయిన్‌ల నుంచి ఐట‌మ్ భామ‌ల‌ వ‌ర‌కు సోష‌ల్ మీడియానే న‌మ్ముకుంటున్నారు. అదే విదిక‌గా త‌మ అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోతున్నారు. ఫ్రీ గ్లామ‌ర్ షోకు తెర‌తీస్తున్నారు. త‌మ అంద చందాలు న‌చ్చి ఏ హీరో, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ అయినా అవ‌కాశం ఇవ్వ‌క‌పోతారా అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బా కూడా ఇదే పంథాను అనుస‌రిస్తూ మేక‌ర్స్‌కి గాలం వేస్తోంది. ఇక్క‌డ తెలుగమ్మాయిల‌ని ప్రోత్స‌హిస్తాం అని స్టేజ్‌పై లెక్చ‌ర్‌లు ఇస్తున్న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్రాక్టిక‌ల్‌గా మాత్రం ఆ ప‌ని చేయ‌డం లేదు. అదే గ్లామర్ డాల్ ఈషా రెబ్బా పాలిట శాపంగా మారుతోంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆరేళ్లు డాటుతున్నా ఈషాకు మాత్రం చెప్పుకోద‌గ్గ అవ‌కాశం త‌లుపుత‌ట్ట‌లేదు.

`అర‌వింద స‌మేత` లాంటి పెద్ద చిత్రాల్లో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా అది ఎలాంటి ప్రాధాన్య‌త లేని పాత్రే కావ‌డంతో ఆమె కెరీర్‌కి పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాలు చేస్తున్న ఈషా రెబ్బా గ‌త కొన్ని రోజులుగా హాట్ హాట్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాను హీటెక్కించేస్తోంది. తాజాగా హోలీ సంద‌ర్భంగా ఈషా రిలీజ్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వైట్ డ్రెస్‌లో అందాల్ని కురిపిస్తూ చుర‌క‌త్తిలాంటి చూపుల్తో యూత్‌ని మెస్మ‌రైజ్‌ చేస్తోంది. ఇప్ప‌టికైనా ఆమె టాలెంట్‌ని మ‌న తెలుగు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు గుర్తిస్తారేమో చూడాలి.