మెగాస్టార్ మూవీలో ఈషా రెబ్బ


Eesha Rebba in Megastar chiranjeevi movie
Eesha Rebba in Megastar chiranjeevi movie

గత కొంత కాలంగా గ్లామర్ డ్రెస్సుల్లో అందాల డోస్ పెంచుతున్న బ్యూటీ ఈషా రెబ్బ. తెలుగమ్మాయిలు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటారు అనే కామెంట్స్ కి ఫోటో షూట్స్ తో సమాధానం చెప్పిన ఈ బ్యూటీ ఘాటు అందాలతో అందరికి షాకిస్తోంది. ఇటీవల బ్లాక్ డ్రెస్సుల్లో ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఫైనల్ గా మెగాస్టార్ సినిమాలో ఈషా రెబ్బ అవకాశం దక్కించుకున్నట్లు టాక్ వస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ తన 152వ సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ తో స్పీడందుకోనుంది. ఇక సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిషను అనుకుంటున్నట్లు ఇటీవల టాక్ వచ్చింది. కానీ ఇంకా ఈ విషయంలో అఫీషియల్ ఏనౌన్స్మెంట్ రాలేదు. ఇకపోతే ఒక స్పెషల్ పాత్రకు ఈషా రెబ్బను తీసుకోవాలని చిత్ర యూనిట్  ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగమ్మాయిగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈషా రెబ్బ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అంటోంది. గత ఏడాది అరవింద సమేత లో హీరోయిన్ సిస్టర్ గా కనిపించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా క్లిక్కవ్వాలని చూస్తున్న ఈ టాలీవుడ్ బ్యూటీ కెరీర్ పుంజుకోవాలంటే మెగాస్టార్ లాంటి హీరోతో నటించి మంచి సక్సెస్ కొట్టాల్సిందే. మరి అమ్మడి లక్కు ఎంతవరకు క్లిక్కువుతుందో చూడాలి.