పాపం ! ఈషా రెబ్బా !!


అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈషా రెబ్బా ! మొదటి చిత్రంతోనే హిట్ కొట్టిన ఈషా రెబ్బా కు ఆశించిన స్థాయిలో అయితే అవకాశాలు రాలేదు . అగ్ర హీరోల సినిమాల్లో నటించాలని హీరోయిన్ గా స్టార్ డం అందుకోవాలని ఆశపడింది కానీ పాపం ! ఈ భామ ఆశలు నెరవేరేలా లేవు దాంతో అందాల ప్రదర్శన చేస్తూ హాట్ ఇమేజ్ కోసం తహతహలాడుతోంది . గతకొంత కాలంగా అదేపనిగా స్కిన్ షో చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాక రేపుతోంది ఈషా రెబ్బా .

అయితే ఈ భామ ఎంతగా స్కిన్ షో చేస్తున్నా అవకాశాలు మాత్రం అంతగా రావడం లేదు . చిన్న చిన్న సినిమాలు లేదంటే పెద్ద సినిమాల్లో ఛాన్స్ వచ్చినా అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు వస్తున్నాయి పాపం . తాజాగా మరోసారి అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . పాపం ! ఇప్పుడైనా ఈ భామని అగ్ర హీరోలు కనికరిస్తారేమో చూడాలి .