అమ్మడి గ్లామర్ ఫోటోషూట్ల వెనక కారణమిదే

Eesha reveals reason behind glamorous photoshoots
Eesha reveals reason behind glamorous photoshoots

తెలుగు హీరోయిన్లకు అవకాశాలు పెద్దగా ఇవ్వరు అన్నది టాలీవుడ్ లో ఒక నానుడిగా మారిపోయింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నా ఎక్కువగా దర్శకనిర్మాతలు చెప్పేది వాళ్లతో అయితే గ్లామర్ పరంగా చూపించడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని. అయితే ఈ రీజన్ కు అసలు అర్ధమే లేదని, తాము గ్లామర్ గా కనిపించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని ఇప్పటికే చాలా మంది తెలుగు భామలు చెప్పుకొచ్చారు. ఉదాహరణకు ఈషా రెబ్బను తీసుకుంటే ఆమె రీసెంట్ గా తనలోని గ్లామర్ యాంగిల్ ను పూర్తిగా వాడుకుంటోంది. ఈషా, మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో అంతకు ముందు.. ఆ తర్వాత అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో పూర్తిగా ట్రెడిషనల్ గా, పక్కింటి అమ్మాయి తరహా పాత్రను వేసింది. అప్పటికీ, ఇప్పటికీ ఈషాను పోల్చి చూసుకుంటే అసలు సంబంధమే కనిపించదు. ఇద్దరూ ఒక్కరేనా అనే భావన కనిపిస్తుంది. అంతలా తనను తాను మార్చుకుంది ఈషా రెబ్బ.

అయితే అసలు ఈ మధ్య ఇంతలా గ్లామర్ ఫోటోషూట్లు చేయడానికి గల కారణమేంటో చెప్పేసింది ఈషా. ఏ మాత్రం సంశయం లేకుండా, తనలోని హాట్నెస్ ను చూపించడానికే ఇలా ఫోటోషూట్లు చేస్తానని ఈషా తెలిపింది. తాను ముందు నుండీ హాట్ అని, కానీ తెలుగమ్మాయి అవ్వడం మూలాన తనకు అందరూ ట్రెడిషనల్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారని, తానూ గ్లామర్ గా కనిపించగలననే విషయం దర్శకనిర్మాతలకు అర్ధమయ్యేలా చెప్పేందుకే ఈ ఫోటోషూట్లు అని తెలిపింది. ఇంత ఓపెన్ గా ఫోటోషూట్ల వెనకున్న రహస్యాన్ని ఎవరూ ఇప్పటిదాకా చెప్పి ఉండరేమో. అయితే ఇప్పుడు దర్శకనిర్మాతల ఆలోచనలో మార్పు వచ్చిందని, తనకు భిన్నమైన పాత్రలు ఆఫర్ చేస్తున్నారని తెలిపింది.

ఇటీవలే లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటించినట్లు పేర్కొంది. అయితే హిందీలో కియారా పాత్రను నేను తెలుగులో చేశాను అన్నది అబద్ధమని, ఒక సిరీస్ ను రెండు సార్లు ఎందుకు తీస్తారని, ఇది పూర్తిగా భిన్నమైన కథ అని తెలిపింది. ఈ వెబ్ సిరీస్ మార్చ్ లో విడుదలవుతుందని చెప్పింది. తన సిరీస్ ను సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసాడని, ఇందులో అవసరాల శ్రీనివాస్ కూడా నటించాడని తెలిపింది. మరో రెండు సిరీస్ లకు తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తారని అంది ఈషా రెబ్బ.