ఒకే రోజున 8 సినిమాలు విడుదల !

Eight movies waiting their luck on 15 th marchప్రాణం ఖరీదు , మౌనమే ఇష్టం , బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ , వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి , మనసా వాచా , మాగ్నెట్ , అర్జున , విలేజ్ పోరగాళ్ళు అనే 8 చిత్రాలు ఈనెల 15 న రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి . ఎల్లుండి థియేటర్ లలోకి రానున్నాయి అయితే రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు కానీ ఇందులో ఎన్ని సినిమాలు థియేటర్ లలోకి వస్తాయో మాత్రం తెలీదు ఎందుకంటే ప్రకటన ఇవ్వడం ఈజీనే కానీ రిలీజ్ కి బోలెడు వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అవి ఫుల్ ఫిల్ అయితేనే థియేటర్ లో బొమ్మ పడేది .

 

అయితే ఈ ఎనిమిది చిత్రాల్లో 5 నుండి 6 చిత్రాలు మాత్రం రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది . హాట్ భామ వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి కి క్రేజ్ ఉంది ఇక మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించడం పైనే ఆధారపడి ఉంది అదృష్టం . అలాగే సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ నటించిన అర్జున చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధం చేసారు కానీ అది ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం నాటి సినిమా . మరి అది రిలీజ్ అవుతుందా ? హిట్ అవుతుందా ? చూడాలి .

English Title : Eight movies waiting their luck on 15th march