పోటీ చేస్తున్న రాజశేఖర్ – జీవిత


Election War in MAA

మా ఎన్నికలు మళ్ళీ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి . ఈసారి జరిగే ఎన్నికల్లో సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా , జీవిత ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తోంది . ఈ ఇద్దరూ సీనియర్ హీరో , క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నరేష్ ప్యానల్ తరుపున పోటీ చేస్తున్నారు . నరేష్ ప్రధానకార్యదర్శి గా సేవలందించాడు అయితే ఈసారి శివాజీరాజా తో తలపడాలని భావించి తన ప్యానల్ ని ప్రకటించాడు . ఇక శివాజీ రాజా ఇంతకుముందే తన ప్యానల్ ని ప్రకటించింది .

 

దాంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి . మార్చి 10 న ఈ ఎన్నికలు జరుగనుండగా ఇప్పటినుండే ఎన్నికల వేడి రాజుకుంది . ఈ సందర్భంగా ఒకరి పై మరొకరు ఆరోపణలు చేసుకోవడం ఖాయం . ఇప్పటికే శివాజీ రాజా మీద ఆగ్రహంగా ఉన్నాడు నరేశ్ . అయితే రాజశేఖర్ – జీవితలు పోటీ చేస్తున్నప్పటికీ చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున ల మద్దతు ఎవరికి ఉండనుందో చూడాలి .

English Title: Election War in MAA