అక్రమ సంబంధం ఉందని ఒప్పుకున్నాడు


Emraan Hashmi
Emraan Hashmi

పెళ్ళైన యువతి తో నాకు అక్రమ సంబంధం ఉందని తన తప్పు ని ఒప్పుకున్నాడు బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ . బాలీవుడ్ లో లిప్ లాక్ ల హీరో అనగానే టక్కున గుర్తొచ్చేది ఇమ్రాన్ హష్మీ పేరు మాత్రమే . అయితే ఇన్నాళ్లకు గానీ తన తప్పు తెలిసిరాలేదు ఈ హీరోకు . నా నిజ జీవితంలో ఓ మహిళతో నాకు అక్రమ సంబంధం ఉంది , పైగా మేమిద్దరం సన్నిహితంగా ఉన్నపుడు ఆమె భర్త చూసాడు దాంతో పెద్ద గొడవ అయ్యిందని అంటున్నాడు .

అప్పటి వరకు ఆమెకు పెళ్లైన విషయం ఇమ్రాన్ హష్మీ కి తెలియదట ! ఆమెకు పెళ్లయింది అనే విషయం తెలిసినప్పటికీ ఆమె నుండి దూరం కావడానికి మనసొప్పలేదట ! దాంతో ఆ తప్పు అప్పుడు తప్పుగా అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా పెద్ద తప్పు చేశాను అక్రమ సంబందం పెట్టుకొని అని అంటున్నాడు . అయితే ఆమె ఎవరు అన్నది మాత్రం రివీల్ చేయడం లేదు ఈ హీరో .