సంక్రాంతికి రామ్‌ `రెడ్‌` సిగ్న‌ల్ ఇచ్చేశాడు!

సంక్రాంతికి రామ్‌ `రెడ్‌` సిగ్న‌ల్ ఇచ్చేశాడు!
సంక్రాంతికి రామ్‌ `రెడ్‌` సిగ్న‌ల్ ఇచ్చేశాడు!

`ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో హీరో ఎన‌ర్జిటిక్ హీరామ్  రో బాక్సాఫీస్ స్టామినా ఏంటో మ‌రోసారి రుజువైంది. చాలా కాలం త‌రువాత త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ రావ‌డంతో రామ్ రెట్టించిన ఉత్స‌హంతో వున్నారు. ఇదే జోష్‌లో ఆయ‌న న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `రెడ్‌`. కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రామ్ తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేశారు. మాళ‌విక శ‌ర్మ‌, నివేదా పేతురాజ్ హీరోయిన్‌లుగా న‌టించారు. స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి రెడీ అవుతోంది.

`ఇస్మార్ట్ శంక‌ర్` వంటి మాసీవ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత రామ్  నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. లాక్‌డౌన్ కార‌ణంగా `వి` త‌ర‌హాలో ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే సినిమాపై వున్న పూర్తి న‌మ్మ‌కంతో ఈ చిత్రాన్ని ఎలాగైనా థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని హ‌రీఓ రామ్ కాన్ఫిడెన్స్‌తో వున్నారు. తాజాగా థియేట‌ర్లు రీఓపెన్ కావ‌డంతో `రెడ్‌` చిత్రాన్ని సంక్రాంతికి థియేట‌ర్ల‌లో రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు.

ఈ నెల 24న థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేయ‌బోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన `కైన్ హే అచ్చా.. కౌన్ హే లుచ్చా వంటి పాట‌తో సినిమాపై భారీ క్రేజ్ నెల‌కొంది. మ‌ణిశ‌ర్మ అందించిన పాట‌టు ఇప్ప‌టికే విడుద‌లై హ్యూజ్ క్రేజ్‌ని తీసుకొచ్చాయి. ఈ మూవీతో మ‌ళ్లీ రామ్ – ‌మ‌ణిశ‌ర్మ `ఇస్మార్ట్ శంక‌ర్‌` మ్యాజిక్‌ని రిపీట్ చేసేలా క‌నిసిస్తోంది. ఆ మూవీని కూడా మ్యాజిక‌ల్ హిట్ చేసిన మ‌ణిశ‌ర్మ అదే స్థాయిలో `రెడ్‌`ని కూడా మ్యాజిక‌ల్ హిట్‌గా నిల‌బెట్ట‌బోతున్నారు. ఈ మూవీ జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌య్యే అవ‌కాశం వున్న‌ట్టు తెలుస్తోంది. రామ్‌కు సంక్రాంతి సెంటిమెంట్ వుంది. త‌ను న‌టించిన దేవ‌దాస్‌, మ‌స్కా చిత్రాలు సంక్రాంతికి విడుద‌లై భారీ విజ‌యాల్ని సాధించాయి. అదే మ్యాజిక్ `రెడ్‌` సినిమాకు కూడా రిపీట్ అవుతుంద‌ని హీరో రామ్ చాలా కాన్ఫిడెంట్‌తో చెబుతున్నారు.