రియాకు స‌మ‌న్లు జారీ చేసిన ఈడీ! 

enforcement directorate summons Rhea chakrobarthy
enforcement directorate summons Rhea chakrobarthy

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ రియాకు స‌మ‌న్లు జారీ చేసింది. గ‌త కొన్ని రోజులుగా ప‌ట్నా పోలీసుల‌కు చిక్క‌కుండా త‌ప్పించుకుంటోంద‌ని రియాపై బీహార్ డీజీపీ సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేసిన నేప‌థ్యంలో ఈడీ ఆమెకు స‌మ‌న్లు జారీ చేయ‌డం, సుశాంత్ కేసు సీబీఐకి బ‌దిలీ కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ నెల 7న త‌మ ముందు ఎట్టిప‌రిస్థితుల్లోనూ హాజ‌రు కావాల‌ని రియాని ఈడీ హెచ్చ‌రించింది.

సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్ల లావాదేవీలు జ‌ర‌గ‌డంపై స‌ర్వ‌త్రా సందేహాలు వ్య‌క్తం కావ‌డంతో ఈడీ గ‌త వారం మ‌నీ లాండ‌రింగ్ కేసుని ఫైల్ చేసింది. ఆర్థిక లావాదేవీల అంశంపై సుశాంత్‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగిన రియాను ఈగీ ప్ర‌శ్నించ‌నుంది. రియాతో పాటు ఈ కేసులో అనుమానంగా వున్న వ్య‌క్తుల్ని కూడా ఈడీ ప్ర‌శ్నించ‌డానికి రంగం సిద్ధం చేస్తోంద‌ని, వారికి స‌మ‌న్లు జారీ చేయ‌నుంద‌ని ముంబై వ‌ర్గాల టాక్.

సుశాంత్ మ‌ర‌ణంపై దేశ వ్యాప్తంగా ప‌లు అనుమానాలు వ్య‌క్తం కావ‌డంతో కేంద్రం సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్టు ప్ర‌భుత్వ త‌రుపు న్యాయ‌వాదులు బుధ‌వారం సుప్రీమ్ కోర్టుకు విన్న‌వించారు. దీంతో సుశాంత్ కేసు స‌రికొత్త మ‌లుపు తిరిగింది. సుశాంత్ ఆత్మ హ‌త్య చేసుకున్నాడా?  కావాల‌నే కొంత మంది అత‌న్ని హ‌త్య చేసి ఆత్మ హ‌త్య‌గా చిత్రించారా? అన్న‌ది త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానుంద‌ని, రియా బండారం కూడా బ‌య‌ట‌ప‌డుతుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.