ఎంత మంచివాడవురా 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్



ఎంత మంచివాడవురా 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
ఎంత మంచివాడవురా 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ సినిమా ఎంత మంచివాడవురా ఈ సంక్రాంతికి జనవరి 15న విడుదలైన సంగతి తెల్సిందే. సంక్రాంతి సెలవుల వల్ల ఓపెనింగ్ బాగున్నా ఈ చిత్రానికి టాక్ అంత బాగోకపోవడంతో రెండు రోజుల తర్వాత ఈ చిత్రం కలెక్షన్స్ డల్ అయ్యాయి. నాలుగు రోజులు పూర్తైన తర్వాత ఎంత మంచివాడవురా 5.27 కోట్ల షేర్ సాధించింది. ఇక రేపటినుండి వర్కింగ్ డేస్ కావడంతో ఈ చిత్రం కలెక్షన్స్ బాగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఎంత మంచివాడవురా ఫెయిల్ అయినట్లే.

ఎంత మంచివాడవురా ఏరియా వైజ్ బ్రేక్ డౌన్ :

నైజాం : Rs 1.23 Cr

సీడెడ్ : Rs 0.72 Cr

గుంటూరు : Rs 0.63 Cr

వైజాగ్ : Rs 0.62 Cr

ఈస్ట్ గోదావరి : Rs 0.79 Cr

వెస్ట్ గోదావరి : Rs 0.74 Cr

నెల్లూరు : Rs 0.20 Cr

కృష్ణ : Rs 0.54 Cr

ఆంధ్ర + తెలంగాణ : Rs 5.27 Cr షేర్స్

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. గోపి సుందర్ దర్శకత్వం వహించాడు. ప్రతి వ్యక్తికి సాయపడాలనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే.