
నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పటినుండో హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే. గత సినిమా 118 డీసెంట్ గా ఆడిన తన మార్కెట్ ను తిరిగి పొందాలంటే కళ్యాణ్ రామ్ కు ఇప్పుడు ఒక భారీ హిట్ చాలా అవసరం. ఎంత మంచివాడవురా తనకు అలాంటి చిత్రం అవుతుందని ఆశ పడ్డాడు కళ్యాణ్ రామ్. అందుకే తన ఇమేజ్ కు భిన్నంగా వెళ్లి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేసాడు. దానికి సంక్రాంతి రిలీజ్ ను కూడా పెర్ఫెక్ట్ గా సెలక్ట్ చేసుకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనెర్స్ కు సంక్రాంతి సీజన్ లో రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సీజన్ ను సెలక్ట్ చేసుకుని ఉండొచ్చు. పోటీగా రెండు భారీ తెలుగు చిత్రాలు విడుదలవుతున్నా కానీ చాలా ధైర్యంగా తన సినిమాను కూడా విడుదల చేసాడు.
అయితే అంతా బానే ఉన్నా ఈ సినిమాకు టాక్ మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. శతమానం భవతి చిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ వేగేశ్న శ్రీనివాస కల్యాణంతోనే ట్రాక్ తప్పాడు. అందులో ఎక్కువగా ప్రీచింగ్ అయిందన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది. అయితే ఎంత మంచివాడవురా చిత్రంలో కూడా సతీష్ వేగేశ్న అదే ప్రీచింగ్ చేయడంతో దీనికి కూడా నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.
సంక్రాంతి సీజన్ కావడంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. తొలిరోజు ఈ చిత్ర కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :
నైజాం : Rs 0.60 Cr
సీడెడ్ : Rs 0.37 Cr
గుంటూరు : Rs 0.19 Cr
వైజాగ్ : Rs 0.19 Cr
ఈస్ట్ : Rs 0.29 Cr
వెస్ట్ : Rs 0.20 Cr
నెల్లూరు : Rs 0.09 Cr
కృష్ణ : Rs 0.19 Cr
ఆంధ్ర+తెలంగాణ : Rs 2.12 Cr Shares.