ఎంత మంచివాడవురా 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


Entha Manchivadavura 2 Days Collections
Entha Manchivadavura 2 Days Collections

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంత మంచివాడవురా బిలో యావరేజ్ రేటింగ్స్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో కాన్సెప్ట్ కు ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కారని క్రిటిక్స్ తేల్చేసారు. పైగా సినిమా చాలా స్లో గా ఉంటుందని, క్లాస్ లు పీకడం కూడా ఎక్కువైందని అన్నారు. దీంతో ఈ సినిమా నిలబడడం కష్టమనే భావించారంతా. అయితే సంక్రాంతి సీజన్ లో విడుదల కావడం ఎంత పెద్ద ప్లస్సో ఈ సినిమా మరోసారి చూపించింది.

మొదటి రోజే రేటింగ్స్ తో పనిలేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.12 కోట్ల షేర్ ను, 4 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ చిత్రం కనుమ రోజున కూడా డీసెంట్ గానే పెర్ఫార్మ్ చేసింది. కనుమ రోజున ఈ చిత్రం 1.22 కోట్ల షేర్ ను రాబట్టగలిగింది. ఈ సినిమాకు వచ్చిన టాక్ తో పోల్చుకుంటే ఈ కలెక్షన్స్ పర్వాలేదనే చెప్పవచ్చు. అయితే ఎంత మంచివాడవురా 10 కోట్లకు పైనే థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈరోజు, రేపు వర్కింగ్ డేస్ కావడంతో ఎంత మంచివాడవురా కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ఆదివారం వరకూ ఈ చిత్రం స్ట్రాంగ్ గా నిలబడగలిగితే ఎంత మంచివాడవురా యావరేజ్ తో ముగించే వీలుంటుంది. లేదంటే ఈ చిత్రానికి ఇక కష్టమే.

ఎంత మంచివాడవురా 2 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:
నైజాం : 1.16 కోట్లు
సీడెడ్ : 55 లక్షలు
గుంటూరు : 36 లక్షలు
ఉత్తరాంధ్ర : 35 లక్షలు
తూర్పు గోదావరి : 48.5 లక్షలు
పశ్చిమ గోదావరి : 32.4 లక్షలు
కృష్ణా : 33 లక్షలు
నెల్లూరు : 13.4 లక్షలు

ఆంధ్ర + తెలంగాణ : 3.69 కోట్లు

సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటించింది. మరి చూడాలి ఎంత మంచివాడవురా ఫుల్ రన్ లో ఎంతతో ముగిస్తుందో.