మంచివాడికి క్లీన్ యు ఇచ్చేశారు!Entha Manchivadavura censor completed
Entha Manchivadavura censor completed

`శ‌త‌మానం భ‌వ‌తి` సినిమాతో జాతీయ పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు వేగేశ్న స‌తీష్‌. ఆయ‌న నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌తో తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఎంత మంచి వాడ‌వురా`.  తొలిసారి ఈ సినిమా ద్వారా ఆదిత్య మ్యూజిక్ సంస్థ చిత్ర నిర్మాణంలోకి ప్ర‌వేశిస్తోంది. శ్రీ‌దేవి మూవీస్ అథినేత శివలెంక కృష్ణ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌కులేగా వ్య‌వ‌హిరిస్తున్నారు. మెహ్రీన్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా ఈ నెల 15న  రిలీజ్ కాబోతోంది.

`శ‌త‌మానం భ‌వతి` చిత్రాన్ని కుటుంబ అనుబంధాల నేప‌థ్యంలో తెర‌కెక్కించి విమ‌ర్శ‌శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు, తాజా చిత్రాన్ని కూడా అంత‌కు మించిన కుటుంబ‌ భావోద్వేగాల స‌మాహారంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని జోడించి తెర‌కెక్కించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌లే సెన్సార్ పూర్తయింది. ఎలాంటి క‌ట్స్ లేకుండా క్లీన్ యు ల‌భించ‌డంతో చిత్ర బృందం ఆనందం వ్య‌క్తం చేస్తోంది.

ఈ సంక్రాంతికి త‌మ సిన‌మాతో క్లీన్ ఫ్యామిటీ ఎంటర్‌టైన‌ర్‌ని అందిస్తున్నామని, హృద‌యానికి హ‌త్తుకునే అంద‌మైన ఎమోష‌న్స్‌తో సాగు చ‌క్క‌ని కుటుంబ క‌థా చిత్ర‌మిదని, సున్నిత‌మైన భావోధ్వుగాల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా త‌ప్ప‌కుండా ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని అందిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు వేగేశ్న స‌తీష్ కాన్ఫిడెంట్‌తో చెబుతున్నారు. శ‌ర‌త్‌బాబు, సుహాసిని, వి.కె. న‌రేష్‌. త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.