నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాను అలా వదిలేశారేంటి?నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాను అలా వదిలేశారేంటి?
నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాను అలా వదిలేశారేంటి?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన సినిమాలలో వచ్చిన హిట్లు కంటే పోయిన సినిమాలే ఎక్కువ. అయినా కానీ కళ్యాణ్ రామ్ ఇంకా హీరోగా నిలదొక్కుకున్నాడంటే దానికి కారణం అతను కొట్టిన హిట్లు అన్నీ మంచి సినిమాలు. బేసిక్ గా మంచి నేచర్ ఉన్న కళ్యాణ్ రామ్ కు ప్రేక్షకులలో కూడా మంచి ఒపీనియన్ ఉంది. హిట్లు కన్సిస్టెంట్ గా వస్తే పరిస్థితి ఎలా ఉండేదో కానీ, ప్రయోగాలు ఎక్కువ చేసిన కళ్యాణ్ రామ్ చేతులు కాల్చుకోవడమే కాక హీరోగా తన కెరీర్ ను కూడా ఎఫెక్ట్ చేసుకున్నాడు. అయినా కానీ తనవంతు ప్రయత్నంగా రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా అనే చిత్రాన్ని రెడీ చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

సాధారణంగా సంక్రాంతి సినిమాలకు బజ్ బానే ఉంటుంది. ప్రేక్షకులు కూడా సంక్రాంతి సినిమాల పట్ల బానే ఆసక్తి ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఎంత మంచివాడవురా సినిమా విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అసలు ఈ సినిమా ఒకటి వస్తోందన్న సంగతే ప్రేక్షకులకు తెలీదు. దీన్నే బట్టే సినిమా ప్రమోషన్స్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న ఈ సినిమాలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ఒక పాట విడుదలైంది. అసలు ఈ పాట విడుదలైన్నట్లు కూడా ఎవరికీ తెలీదు. ప్రొడక్షన్ హౌస్ కూడా ఏదో వేసాం అన్నట్లుగా ఒక ట్వీట్ వేసి ఊరుకున్నారు.

జనరల్ గా నందమూరి సినిమాలకు సెపరేట్ గా ఒక పిఆర్ టీమ్ ఉంటుంది. వాళ్ళ సినిమాలు ఏవి విడుదలైనా కూడా ఆ పిఆర్ టీమ్ దాని సంగతి చూసుకుంటుంది. అలా నందమూరి హీరోలు ఒక పిఆర్ టీమ్ సెట్ చేసుకున్నాక ప్రమోషన్స్ విషయంలో చురుగ్గా ఉంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కు ఆ పద్దతి భలే కలిసొచ్చింది. అయితే ఎంత మంచివాడవురా విషయంలో ఎందుకో ఆ పిఆర్ టీమ్ అసలు యాక్టివ్ గా ఉండట్లేదు. కనీస ప్రమోషన్స్ లేక మిగతా సంక్రాంతి సినిమాల మధ్య ఎంత మంచివాడవురా బిక్కుబిక్కుమంటోంది. అసలే ఈసారి సంక్రాంతికి బడా సినిమాలు మన ముందుకు వస్తున్నాయి. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు రెండూ కూడా ప్రమోషన్స్ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.

పెద్ద సినిమాలైనా వారు అంతలా ప్రమోట్ చేస్తుంటే ఎంత మంచివాడవురాకు ఎందుకని ఇలా సైలెంట్ గా ఉంటున్నారు. కావాలనే లో ప్రొఫైల్ కోరుకుంటున్నారా అంటే అలా చేస్తే సంక్రాంతి టైమ్ లో మొదటికే మోసం వస్తుంది. కనీసం ఇప్పటికైనా వాళ్ళు మేల్కొని సినిమాను ప్రమోట్ చేయాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఎంత మంచివాడవురాను సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తుండగా మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. జనవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.