ఇంతకీ ఎంత మంచివాడవురా ఎలా ఉండనుంది


ఇంతకీ ఎంత మంచివాడవురా ఎలా ఉండనుంది
ఇంతకీ ఎంత మంచివాడవురా ఎలా ఉండనుంది

సంక్రాంతి సీజన్ అనగానే ఒక మీడియం బడ్జెట్ సినిమా విడుదల కావడం ఆనవాయితిగా మారింది. అయితే ఈ చిత్రాలు ఎక్కువ శాతం విజయవంతమవడం ప్రధాన ఆకర్షణ. ఈ ఏడాది కూడా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకుల దృష్టి ప్రధానంగా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలపైనే ఉండడంతో ఎంత మంచివాడవురా లో కీ రిలీజ్ అవుతోందని చెప్పాలి. ఈ చిత్రానికి నిన్న సెన్సార్ పూర్తయింది. సభ్యులు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈరోజు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. అయితే అంతా బానే ఉంది కానీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా ఇంకా ఈ చిత్ర కథ విషయంలో ఎటువంటి క్లారిటీ రాలేదు.

గుజరాతీ సినిమా ఆక్సిజన్ ను స్ఫూర్తిగా తీసుకుని రూపొందిన ఎంత మంచివాడవురా కాన్సెప్ట్ సాటి మనిషికి సహాయపడితే ప్రపంచం చాలా అందంగా ఉంటుంది అన్న తరహాలో సాగుతుందని అర్ధమవుతోంది. ఎవరైనా సహాయం అడిగినప్పుడు కాదనుకుండా చేసే హీరో అన్యాయానికి కూడా ఎదురుతిరిగి పోరాడగలడు. ఈ పాయింట్ తో ఎంత మంచివాడవురా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కామెడీ, ఇంటర్వెల్ ఫైట్, సుహాసిని – తనికెళ్ళ భరణి మధ్య వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్, నందమూరి కళ్యాణ్ రామ్ పాత్ర ఇవన్నీ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని సమాచారం.

ఈ సంక్రాంతికి అందరూ ఎదురుచూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ చిత్రం కాగలదన్న నమ్మకాన్ని కళ్యాణ్ రామ్ అండ్ బృందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. శతమానం భవతి చిత్రాన్ని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేయడంతో అంచనాలు బాగున్నాయి. మరోసారి సతీష్ వేగేశ్న సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తాడని ఆశిస్తున్నారు నందమూరి అభిమానులు. మరి ఎంత మంచివాడవురా కళ్యాణ్ రామ్ కు పెద్ద బ్రేక్ తీసుకొస్తుందో లేదో చూడాలి.