ఎంత మంచివాడవురా విడుదల తేదీ ఖరారు


Entha Manchivadavura release date locked
Entha Manchivadavura release date locked

నందమూరి కళ్యాణ్ రామ్ గత కొన్ని సినిమాల నుండి తన అభిరుచిని మార్చుకున్నాడు. మాస్ కు కొంచెం దూరం జరిగి క్లాస్ గా ఉండే సినిమాలే చేస్తున్నాడు. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ అవార్డు సాధించిన శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలను దర్శకత్వం వహించిన వేగేశ్న, ఈసారి కూడా క్లాస్ కథనే తీసుకున్నాడు.

అలా అని ఇందులో మాస్ అంశాలు లేవని కాదు. రీసెంట్ గా ఇందులో కళ్యాణ్ రామ్ మాస్ అవతార్ ని రివీల్ చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉన్న విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జనవరి 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందరి కంటే ముందే తమ డేట్ ను లాక్ చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్నా గోదావరి షెడ్యూల్ ఈ నెల 25తో పూర్తవుతుంది. నవంబర్ కల్లా చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారు.