కళ్యాణ్ రామ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు


కళ్యాణ్ రామ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు
కళ్యాణ్ రామ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు

దసరా సీజన్ అయిపోవడంతో ఇప్పుడు ఫోకస్ మొత్తం రానున్న పెద్ద పండగ సంక్రాంతిపై పడింది. ఈసారి సంక్రాంతి హేమాహేమీ హీరోలు బరిలోకి దిగబోతున్నారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, రజినీకాంత్ తమ సినిమాలను సంక్రాంతి పోటీలో ఉంచుతున్నారు. అయితే ప్రతీ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు ఒక చిన్న సినిమా కూడా విడుదలై హిట్ కొట్టడం ఆనవాయితీగా మారింది.

గతంలో సంక్రాంతికి శతమానం భవతి చిత్రాన్ని రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సతీష్ వేగేశ్న, నందమూరి కళ్యాణ్ రామ్ ను హీరోగా పెట్టి చేస్తున్న చిత్రం ఎంత మంచివాడవురా. ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. మొదట ఈ చిత్రంపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు కానీ ఇప్పుడు టీజర్ విడుదలవడంతో అందరూ ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు.

మంచివాడు అనుకుంటే ఫైట్లుగట్రా ఉండవని నిరాశపడ్డ ప్రేక్షకులకు టీజర్ లోనే క్లారిటీ ఇచ్చేసాడు కళ్యాణ్ రామ్. ఇతను మంచివాడే కానీ తప్పు జరిగితే తాట తీస్తాడు. చూస్తుంటే ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ లా అనిపిస్తోంది. సంక్రాంతికి పెద్దగా అంచనాల్లేకుండానే బరిలోకి దిగడం పెద్ద ప్లస్ అనే చెప్పాలి. చూస్తుంటే మిగతా బడా హీరోలు ఈ సంక్రాంతికి ‘ఎంత మంచివాడవురా’ను లైట్ తీసుకోకపోవడమే మంచిది.