2 సినిమాలు లీక్ అయ్యాయి


Ranarangam and Evaru
Ranarangam and Evaru

నిన్న విడుదలైన ఎవరు , రణరంగం చిత్రాలు ఆన్ లైన్ లో లీకయ్యాయి . తమిళ రాకర్స్ ఈ రెండు చిత్రాలను లీక్ చేసారు ఫుల్ మూవీ లను . అసలే థియేటర్ లకు పెద్దగా జనాలు రావడం లేదు , సినిమాలు చూడటం లేదని దర్శక నిర్మాతలు బాధపడుతుంటే ఇప్పుడు ఇలా పైరసీ బారిన సినిమాలు పడుతుండటంతో దాని వల్ల వసూళ్ల పై ప్రభావం పడుతోంది .

ఎవరు సినిమాకు హిట్ టాక్ వచ్చింది , ఇక శర్వానంద్ నటించిన రణరంగం చిత్రం కు ఆశించిన స్థాయిలో టాక్ లేదు డివైడ్ టాక్ ఉంది దాంతో ఆ సినిమాకు ఇబ్బందులు తప్పవు . అయితే ఎవరు చిత్రానికి టాక్ బాగుంది కానీ ఇలా పైరసీ బారిన పడటం వల్ల తప్పకుండా వసూళ్ల పై ఆ ప్రభావం పడుతుంది . పైరసీ ని అరికట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పైరసీ ని మాత్రం అరికట్టలేక పోతున్నారు .