ఎవరు రివ్యూ


Evaru Movie Review in Telugu
Evaru Movie Review in Telugu

ఎవరు రివ్యూ:
నటీనటులు :
అడవి శేష్ , రెజీనా , నవీన్ చంద్ర
సంగీతం : శ్రీ చరణ్
నిర్మాతలు : వి . పొట్లూరి , పరమ్ వి పొట్లూరి , కెవిన్ అన్నే
దర్శకత్వం: వెంకట్ రాంజీ
రేటింగ్ : 3.5 / 5
రిలీజ్ డేట్ : 15 ఆగస్టు 2019

థ్రిల్లర్ జోనర్ లో అద్భుత విజయాలను సాధిస్తున్న అడవి శేష్ తాజాగా చేసిన మరో ప్రయత్నమే ఈ ఎవరు ? రెజీనా కాసాండ్రా హీరోయిన్ గా నటించిన ఈ ఎవరు చిత్రంతో వెంకట్ రాంజీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . పివిపి బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :
సమీరా ( రెజీనా కాసాండ్రా ) అశోక్ కృష్ణ ( నవీన్ చంద్ర ) ని హత్య చేస్తుంది . దాంతో ఈ కేసుని విచారించడానికి విక్రమ్ వాసుదేవ్ (అడవి శేష్ ) రంగంలోకి దిగుతాడు . విక్రమ్ వాసుదేవ్ పక్కా కరెప్టెడ్ పోలీస్ , సమీరా కేసుని డబ్బు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాడు . అసలు సమీరా ఎవరు ? ఎందుకు అశోక్ కృష్ణ ని చంపుతుంది ? హత్యకు ముందు సమీరా పై అత్యాచారం జరిగిందా ? ఆ అత్యాచారం చేసింది ఎవరు ? చివరకు విక్రమ్ వాసుదేవ్ ఈ కేసుని ఎలా ముగించాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
రెజీనా
అడవి శేష్
కథ
స్క్రీన్ ప్లే
సినిమాటోగ్రఫీ

డ్రా బ్యాక్స్ :
కొన్ని తికమక సీన్స్

నటీనటుల ప్రతిభ :
సమీరా పాత్రలో రెజీనా కాసాండ్రా అద్భుతంగా నటించింది . అలాగే సమీరా పాత్రలో కావాల్సినంత బోల్డ్ గా కూడా నటించి షాకిచ్చింది . మొత్తానికి రెజీనా కు చాలాకాలం తర్వాత ఛాలెంజింగ్ పాత్ర లభించింది దాంతో దాన్ని సద్వినియోగం చేసుకుంది . కరెప్టెడ్ పోలీస్ గా అడవి శేష్ నటన బాగుంది . అయితే అడవి శేష్ పాత్రలో వేరియేషన్స్ చూపించి మరోసారి మెప్పించాడు . నవీన్ చంద్ర కూడా తన పాత్రలో రాణించాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల్లో రాణించారు .

సాంకేతిక వర్గం :
పచ్చిపులుసు వంశీ అందించిన ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . సినిమాకు కావాల్సిన టెంపో మెయింటేన్ చేసాడు . శ్రీ చరణ్ అందించిన పాటలు బాగున్నాయి , నేపథ్య సంగీతం ఎవరు చిత్రానికి చాలా ప్లస్ అయ్యింది . పివిపి నిర్మాణ విలువలు బాగున్నాయి . ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు . ఇక దర్శకుడు వంకట్ రాంజీ విషయానికి వస్తే …… మంచి కథని ఎంచుకోవడమే కాకుండా దానికి సరిపడా స్క్రీన్ ప్లే రాసుకొని ప్రేక్షకుల్ని చిత్రంలో లీనమయ్యేలా చేసి సక్సెస్ కొట్టాడు .

ఓవరాల్ గా :
థ్రిల్ కి గురిచేసే సినిమా ఎవరు

Click Here: Evaru Movie Review in English