ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం ప్రారంభం


ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ పతాకం పై రాజు శెట్టి దర్శకత్వం లో రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం ఈరోజు వాళ్ళ ఆఫీస్ లో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. యూనిట్ సభ్యులందరు పూజ కార్యక్రమం లో ఫల్గుని సినిమా విజయవంతం అవ్వాలని దేవుడి ని వేడుకున్నారు. అనంతరం పాత్రికేయుల సమావేశం లో

దర్శకుడు రాజు శెట్టి మాట్లాడుతూ “ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ పతాకం పై నిర్మిస్తున్న మూడో చిత్రం ఇది. రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మాఫియా నేపథ్యం లో లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. సినిమా అంత గోవా లో మంచి రిచ్ లొకేషన్స్ లో సినిమా చేస్తున్నాము” అని తెలిపారు.

నిర్మాతలు రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి మాట్లాడుతూ “సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. దర్శకుడు రాజు శెట్టి సినిమా ని అనుకున్న బడ్జెట్ లో ప్లాన్ చేసారు. సింగల్ షెడ్యూల్ లో సినిమా పూర్తీ చేయటానికి అని ప్రయత్నాలు చేస్తున్నాము. సుమన్ గారు, సుహాసిని గారు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సినిమా బాగా వస్తుంది అని నమ్మకం నాకుంది” అని అన్నారు.

హీరోయిన్ లవ్లీ అగర్వాల్ మాట్లాడుతూ ” ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజు శెట్టి గారికి నిర్మాతలు రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి నా కృతఙ్ఞతలు” అని తెలిపారు.

బ్యానర్ : ఎవర్ గ్రీన్ క్రియేషన్స్
ప్రొడ్యూసర్స్ : రవి కుమార్ రెడ్డి , సత్య రెడ్డి
డైరెక్టర్ : రాజు శెట్టి
మేనేజర్ : బెంగుళూరు బాబు
కెమెరా మాన్ : ఖదీర్ అహ్మద్
మాటలు : జంగిటి రాజేష్
పోస్ట్ ప్రొడక్షన్ : మిత్ర స్టూడియోస్

హీరో : కార్తీక్
హీరోయిన్ : లవ్లీ అగర్వాల్
ముఖ్యపాత్రలు : సుమన్, సుహాసిని, జబ్బర్దాస్త్ అప్ప రావు, చిట్టి బాబు, పరచురమ్ సుధాకర్