కాళ్ళు మొక్కాడు ! రాజకీయమంటే ఇదేరా !!


EX MLA tatikonda rajayya begged kadiyam srihari వరంగల్ పూర్వపు జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి . స్టేషన్ ఘన్ పూర్ లో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహించాడు అంతేకాదు మంత్రిగా కూడా పనిచేసాడు కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో జాయిన్ అయ్యాడు ఎం ఎల్ ఏ అయ్యాడు . అంతేకాదు మొదటి తెలంగాణ శాసనసభలో ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు కూడా తీసుకున్నాడు కట్ చేస్తే అవినీతి ఆరోపణలపై రాజయ్య ని తప్పించి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేసాడు ముఖ్యమంత్రి కేసీఆర్ . అప్పటి నుండి శ్రీహరి – రాజయ్య ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యింది పరిస్థితి .

దాంతో ఇటీవలే రాజయ్య ఓ మహిళతో రాసలీలలు సాగిస్తున్న టేప్ లీక్ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది . ఆ టేప్ బయటకి రావడానికి కారణం కడియం శ్రీహరి అని రాజయ్య వర్గం ఆరోపణలు చేసింది కట్ చేస్తే తాజాగా కడియం శ్రీహరి దగ్గరకు వెళ్లిన తాటికొండ రాజయ్య ఏకంగా కడియం కాళ్ళు పట్టుకొని తన గెలుపుకు సహకరించమని అభ్యర్ధించడం సంచలనంగా మారింది . ఇప్పుడు రాజయ్య శ్రీహరి కాళ్ళను మొక్కుతున్న ఫోటో వైరల్ అవుతోంది . దాంతో రాజకీయమంటే ఇదేరా ! అని అంటున్నారు . అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటున్నారు .

English Title: EX MLA tatikonda rajayya begged kadiyam srihari