కేసీఆర్ కు షాక్ ఇచ్చి బీజేపీలో చేరిన వివేక్


EX MP Vivek
EX MP Vivek

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ ఇచ్చి భారతీయ జనతా పార్టీలో చేరాడు మాజీ ఎంపీ వివేక్ . సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వివేక్ ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే ఉత్సాహంతో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు . అయితే టీఆర్ఎస్ పార్టీలో అవమానాలు భరించలేక ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు .

ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన వివేక్ కేంద్ర నాయకత్వంలోని పలువురిని కలిసిన అనంతరం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నాడు . వివేక్ ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసారు కానీ అవేవీ ఫలించలేదు . ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ పై మరింతగా సానుకూల వాతావరణం నెలకొంది దేశ వ్యాప్తంగా దాంతో భారతీయ జనతా పార్టీ బెటర్ అని భావించిన వివేక్ ఆ పార్టీలో చేరాడు .