మహర్షి కి యాడ్ అవుతున్న ఎక్స్ట్రా సీన్స్


ఇప్పటికే నిడివి ఎక్కువగా ఉందన్న విమర్శలు ఎదుర్కొంటోంది మహర్షి చిత్రం అయితే తాజాగా మహర్షి చిత్రంలో మరికొన్ని సన్నివేశాలను యాడ్ చేయడానికి నిర్ణయించుకున్నారు మహర్షి దర్శక నిర్మాతలు . నిడివి ఎక్కువగా ఉన్నప్పటికి సినిమా బోర్ లేదు కాబట్టి మరో నాలుగు సన్నివేశాలను కలపాలని నిర్ణయించుకున్నారట . నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం దాన్ని అమలు చేస్తున్నారు .

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే . మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటించగా అల్లరి నరేశ్ కీలక పాత్రలో నటించాడు . రెండు తెలుగు రాస్ట్రాలలో 55 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది మహర్షి . దాంతో తెలుగు రాస్ట్రాల బయ్యర్లు లాభాలలోకి రానున్నారు . అయితే ఓవర్ సీస్ లో మాత్రం పాపం ఇబ్బందులు తప్పడం లేదు అక్కడ కొన్నవాళ్లకు .