వంద రోజులు పూర్తిచేసుకున్న ఎఫ్ 2


జనవరి 12 న విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ” ఎఫ్ 2 ”. వెంకటేష్తమన్నా , వరుణ్ తేజ్ – మెహరీన్ జంటగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం దిగ్విజయంగా 100 రోజులను పూర్తిచేసుకుంది . శతదినోత్సవం అనేది మర్చిపోయిన ఈరోజుల్లో దిగ్విజయంగా వంద రోజులను పూర్తిచేసుకోవడంతో ఎఫ్ 2 చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది .

రాజమండ్రి , కాకినాడ , కొత్తపేట ఈ మూడుకేంద్రాల్లో డైరెక్ట్ గా వంద రోజులను పూర్తిచేసుకుంది ఎఫ్ 2 . ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది దాంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 84 కోట్ల షేర్ ని రాబట్టి సంచలనం సృష్టించింది . ఎఫ్ 2 భారీ హిట్ కొట్టడంతో ఎఫ్ 3 కి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు .