వంద కోట్లు దాటేసిన ఎఫ్ 2


F2 Fun and Frustration Crosses Rs 100 Cr gross

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ఎఫ్ 2 చిత్రం 13 రోజుల్లోనే వంద కోట్లని దాటేసింది . జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి వసూళ్ల వర్షం కురుస్తోంది . వెంకటేష్ , తమన్నా , వరుణ్ తేజ్ , మెహ్రీన్ , రాజేంద్ర ప్రసాద్ లు నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు . దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ వసూళ్ల ని దాటేసింది . ఇక 65 కోట్ల షేర్ ని రాబట్టింది దాంతో దిల్ రాజు తో పాటుగా బయ్యర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు .

వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఎఫ్ 2 చిత్రం . అలాగే వరుణ్ తేజ్ , దిల్ రాజు , మెహరీన్ లకు కూడా కెరీర్  బిగ్గెస్ హిట్ గా ఎఫ్ 2 చిత్రం నిలిచింది . ఎఫ్ 2 చిత్రానికి 13 రోజుల్లోనే వంద కోట్లు రావడంతో ఇంకా మరిన్ని మంచి వసూళ్లు రావడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం .

English Title: F2 Fun and Frustration Crosses Rs 100 Cr gross