ఎఫ్ 2 హిందీలో కూడా అదరగొడుతోంది


F2
F2

వెంకటేష్ – తమన్నా , వరుణ్ తేజ్ – మెహరీన్ లు జంటలుగా నటించిన ఎఫ్ 2 చిత్రం హిందీలో డబ్ అయ్యింది , హిందీ లో కూడా అదరగొడుతోంది ఈ చిత్రం . తెలుగులో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది , అలాగే బ్రహ్మాండమైన వసూళ్ళని సాధించింది . కట్ చేస్తే ఇదే చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పెట్టేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది .

వెంకటేష్ కామెడీ టైమింగ్ , మెహరీన్ , తమన్నా ల గ్లామర్ , వరుణ్ తేజ్ యాక్టింగ్ వెరసి ఎఫ్ 2 ని సూపర్ హిట్ ని చేసాయి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే . పక్కా ఎంటర్ టైనర్ గా తెరకెక్కడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు .